ప్రధాని మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక బహిరంగ సభలో 50 వేల మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉంది. వేసవి కాలం కాబట్టి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RCB vs DC: అదరగొడుతున్న ఆర్‌సీబీ.. డీసీ జైత్రయాత్ర! ఈరోజు గెలుపెవరిది?
శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో 25 ప్రాజెక్టుల విలువ రూ.2,250 కోట్లు. నగరంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధాన దృష్టి సారించారు. ఇందులో 15 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 1,500 కి.మీ. కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు ఉన్నాయి. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో చౌకాఘాట్ సమీపంలో కొత్త 220 కేవీ సబ్‌స్టేషన్ కూడా రానుంది. ఇక 130 తాగునీటి ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పింద్రాలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రధాని ప్రారంభిస్తారని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. రామ్‌నగర్‌లోని పోలీస్ లైన్స్, పోలీస్ బ్యారక్‌లు, నాలుగు గ్రామీణ రోడ్ల దగ్గర ట్రాన్సిట్ హాస్టల్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Prabhas : మూడు రోజులకు 25 కోట్ల ఆఫర్.. సింపుల్‌గా నో చెప్పిన ప్రభాస్