Site icon NTV Telugu

PM Modi: నేడు కాశీలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.3,884.18 కోట్లతో శంకుస్థాపనలు

Modi

Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకనున్నారు. ఇక, అక్కడి నుంచి మోడీ నేరుగా రాజతలాబ్‌లోని మెహందీగంజ్‌లో వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా రూ.3,884.18 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులను కాశీ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందులో రూ.1629.13 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులను ప్రారంభించనుండగా.. మరో 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ.

Read Also: Off The Record : గోరంట్ల మాధవ్ బాటలో SI సుధాకర్ యాదవ్..?

ఇక, బాబత్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, యూనిటీ మాల్ సమీపంలోని NHపై అండర్‌పాస్ టన్నెల్‌తో సహా రూ.2,255.05 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ కార్డును అందించనున్నారు ప్రధాని మోడీ. దీంతో పాటు 70 ఏళ్లు పైబడిన ముగ్గురు సీనియర్ సిటిజన్లకు మూడు జీఐ ఉత్పత్తులు, ఆయుష్మాన్ కార్డులకు సంబంధించిన సర్టిఫికెట్లను పంపిణీ చేస్తారు. బనాస్ డెయిరీతో అనుబంధించబడిన రాష్ట్రంలోని 2.70 లక్షల పాల ఉత్పత్తిదారులకు రూ.106 కోట్ల బోనస్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాన మంత్రి బాబత్‌పూర్ విమానాశ్రయం నుంచి గ్వాలియర్‌కు బయలుదేరి వెళతారు.

Exit mobile version