PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. 543 సీట్లలో బీజేపీ కూటమి 293 సీట్లను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది. ఆదివారం రోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ నరేంద్రమోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీయే నేతలు, ఎంపీల సమావేశంలో భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, జనసేన ప్రధానిగా మోడీని బలపరిచాయి.
Read Also: Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో లాలూపై సీబీఐ చార్జిషీట్ దాఖలు..
ఇదిలా ఉంటే మోడీ ప్రమాణస్వీకారం తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీలో చేయన్నారు. G7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇటీవల ప్రధాని జార్జియా మెలోని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ పర్యటించనున్నారు. మెలోని ఆహ్వానం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇటలీ ప్రజలకు వారి 79వ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. G7 సమ్మిట్ జూన్ 13 నుండి 15 వరకు అపులియాలోని బోర్గో ఎగ్నాజియాలో జరుగుతుంది. G7 దేశాలలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK ,US ఉన్నాయి.
ఈ సమ్మిట్ తర్వాత స్విట్జర్లాండ్‌లో జూన్ 15 నుంచి 16 వరకు ‘‘ ఉక్రెయిన్‌లో శాంతి శిఖరాగ్ర సదస్సు’’ జరుగనుంది. ఈ సమావేశానికి పీఎం మోడీని అధికారికంగా ఆహ్వానించారు. అయితే, ఈ సదస్సుకు ప్రధాని హాజరవుతారా..? లేదా.? అనేది సందేహమే. రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ.