NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్‌కు ఎలా వెళ్లనున్నారంటే…!

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విమానాల్లో కాకుండా ఉక్రెయిన్‌కు రైల్లో ప్రయాణం చేసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణం చేయనున్నారు. ఇలా వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు మొత్తం 20 గంటలు ప్రయాణం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!

ప్రధాని మోడీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించనున్నారు. 22వ తారీఖున పోలాండ్ సరిహద్దులో నుంచి రైలు మార్గం గుండా విలాసవంతమైన ట్రైనులో ప్రయాణిస్తూ ఉక్రెయిన్ చేరుకోనున్నారు. ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న తర్వాత అక్కడ 7 గంటల పాటు పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడంతో ప్రధాన్యత సంతరించుకుంది. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోడీ చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. ఏడు గంటల పాటు గడిపిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ మోడీ రైలు ద్వారానే పోలాండ్‌కు వస్తారు. ఇలా మూడు రోజుల పర్యటన ముగించుకుని మోడీ భారత్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్‌ పర్యటించినప్పుడు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. మొత్తానికి మోడీ వెళ్లేటప్పుడు 10 గంటలు.. వచ్చేటప్పుడు మరో 10 గంటల పాటు రైల్లో ప్రయాణం చేయనున్నారు.

ఇక మోడీ ప్రయాణించే రైల్లో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్‌, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది ఉంటుంది. వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్‌ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..