NTV Telugu Site icon

PM Modi: రేపు ఢిల్లీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోడీ

Pmmodi

Pmmodi

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగిపోయాయి. అధికార పార్టీ ఆప్.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ కూడా తాజాగా 29 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా కొంత మంది అభ్యర్థులను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Arvind Kejriwal: ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు.. కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల ఆందోళన..

ఇక ప్రధాని మోడీ కూడా శుక్రవారం ఎన్నికల శంఖారావం పూరించారు. భారీ నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మురికివాడ ప్రజలకు ప్లా్ట్లు అందజేశారు. మరోసారి ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఆదివారం హస్తినలో రూ.12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Ram Charan : వామ్మో శంకర్.. జుట్టు ఇంచు తగ్గితే, అలా చూసి ఇలా పట్టేశాడు!

ఇక లోకల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడం కోసం ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్‌ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ మెట్రో ఫేజ్-IVలోని జనక్‌పురి – కృష్ణా పార్క్ సెక్షన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. అలాగే ఫేజ్-IVలోని రిథాలా – కుండ్లి సెక్షన్‌కి శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ కోసం అత్యాధునిక సౌకర్యానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!

Show comments