NTV Telugu Site icon

PM Modi: నేడు ఢిల్లీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోడీ

Modi

Modi

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. అధికార పార్టీ ఆప్.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ కూడా తాజాగా 29 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా కొంత మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

Read Also: Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. స్పర్శదర్శనంలో మార్పులు..

ఇక, ఈరోజు (జనవరి 5) ఢిల్లీలో రూ.12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే, పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. లోకల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడం కోసం ప్రాజెక్టులను ఆరంభించనున్నారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్‌ను ప్రధాన మంత్రి స్టార్ట్ చేయనుండగా.. ఢిల్లీ మెట్రో ఫేజ్-IVలోని జనక్‌పురి – కృష్ణా పార్క్ సెక్షన్‌ను ప్రారంభించనున్నారు. అలాగే, ఫేజ్-IVలోని రిథాలా – కుండ్లి సెక్షన్‌కి శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ కోసం అత్యాధునిక సౌకర్యానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, శుక్రవారం నాడు ప్రధాని మోడీ కూడా ఢిల్లీలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా భారీ నివాస సముదాయాన్ని ప్రారంభించారు. మురికివాడ ప్రజలకు ప్లా్ట్లు అందజేశారు.

Show comments