ఇవాళ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని.. కరోనా వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.. ఈ సమావేశంలో అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.. మరోవైపు ఈ నెల 16వ తేదీన.. మరో ఆరు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని మోడీ.. 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఆయన.. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితులు, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్.. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తదితర అంశాలపై చర్చించనున్నారు.