NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో అత్యున్నత అవార్డ్.. క్వీన్ ఎలిజబెత్ తర్వాత రెండో వ్యక్తిగా హిస్టరీ..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా వెళ్లారు. నైజీరియాతో పాటు జి-20 సమ్మిట్ జరిగే బ్రెజిల్‌తో పాటు దక్షిణ అమెరికా దేశమైన గయానాలో కూడా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేసింది. నైజీరియా ప్రభుత్వం ప్రధాని మోడీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్(జికాన్)తో సత్కరించనుంది. దీంతో ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తిగా ప్రధాని చరిత్ర సృష్టించారు. 1969లో జికాన్ అవార్డును క్వీన్ ఎలిజబెత్ పొందారు. ఈ అవార్డు అందుకున్న మొదటి విదేశీ వ్యక్తిగా ఆమె నిలిచారు.

Read Also: Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు..

ప్రధాని నరేంద్రమోడీకి ఒక దేశం ప్రధానం చేస్తున్న 17వ అత్యున్న పురస్కారం ఇది. ప్రధాని మోడీకి రాజధాని అబుజాలో ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో వైక్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి అబుజా ‘కీ టు ది సిటీ’ని బహుకరించారు. కీ నైజీరియా ప్రజలు ప్రధానమంత్రిపై ఉంచిన విశ్వాసం మరియు గౌరవానికి ప్రతీక. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి నైజీరియాతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

’’ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో మా సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియాకు ఇది నా మొదటి పర్యటన. ప్రజాస్వామ్యంపై భాగస్వామ్య నమ్మకంపై ఆధారపడిన మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నా పర్యటన ఒక అవకాశం. నేను భారతీయ సమాజాన్ని, నైజీరియాలోని స్నేహితులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.