Vande Bharat Express: భారత రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడు రైళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను ఈ రైళ్లు కలపనున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందేభారత్ రైళ్లు సహాయపడనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Read Also: Singham: ‘సింగం’ తరహా హీరో పోలీసులు హానికరం.. బాంబే హైకోర్ట్ జడ్జ్ కీలక వ్యాఖ్యలు..
కొత్త వందేభారత్ రైళ్ల రూట్లు ఇవే:
ఉదయపూర్ – జైపూర్
తిరునెల్వేలి-మధురై – చెన్నై
హైదరాబాద్ – బెంగళూరు
విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా)
పాట్నా – హౌరా
కాసరగోడ్ – తిరువనంతపురం
రూర్కెలా – భువనేశ్వర్ – పూరి
రాంచీ – హౌరా
జామ్‌నగర్-అహ్మదాబాద్
రైల్వేలో ఆధునాతన ఫీచర్లను జోడించడంతో పాటు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారత్ రైల్వే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ప్రస్తుతం రూర్కెలా-భువనేశ్వర్, కాసర్ గోడ్-తిరువనంతపురం మార్గాల్లో ఇప్పుడున్న వేగవంతమైన రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ముందుగానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి.
హైదరాబాద్-బెంగళూర్ మధ్య ప్రయాణ కాలాన్ని 2.5 గంటలు తగ్గిస్తుంది. తిరునెల్వెలి-మధురై-చెన్నై మధ్య 2 గంటల సమయం ఆదా అవుతుంది. పూరీ, భువనేవ్వర్, మధురై, తిరునల్వేలి, విజయవాడ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ అందిస్తుంది.