PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ఈరోజు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం మరింత పెరగనుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత్‌కు ఇది పెద్ద విజయం అని చెప్పాలి.
Read Also: Ghaati : ‘దేసీ రాజు’ను పరిచయం చేయబోతున్న ‘ఘాటీ’
ఇక, ఐఎన్‌ఎస్ సూరత్.. పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద నాలుగో యుద్ధనౌకను అభివృద్ధి చేస్తున్నారు. ఇది, ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో ఒకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలు సైతం పని చేస్తాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం అని చెప్పాలి. అలాగే, ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌకగా నిలవనుంది. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇక, ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామిగా చెప్పుకొవాలి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేశారు.
Read Also: Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..
అలాగే, నవీ ముంబైలో ఇస్కాన్ ప్రాజెక్టు కింద శ్రీశ్రీశ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో చాలా మంది దేవతలతో కూడిన ఆలయం, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియం, ఆడిటోరియం, ఆరోగ్య కేంద్రం లాంటివి ఉండనున్నాయి.