Site icon NTV Telugu

NDA CMs Meeting: నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

Nda

Nda

NDA CMs and Deputy CMs Meeting: నేడు ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రుల, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు.

Read Also: Miss World 2025: మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో తలుక్కుమన్న కు తెలంగాణ డిజైన్లు

అయితే, ఈరోజు జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత రక్షణ దళాలు, ప్రధాన మంత్రి మోడీని అభినందించనున్నారు. అలాగే, జనాభా లెక్కింపులో కుల గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీయే పాలిత సీఎంలు అభినందనలు తెలపనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వ తొలి వార్షికోత్సవం.. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తైన 50వ లోక్‌తంత్ర హత్య దివస్ లాంటి కార్యక్రమాలపై చర్చ జరగనుంది.

Exit mobile version