Site icon NTV Telugu

PM Modi: బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ.. ఎప్పటినుంచంటే..!

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్టోబర్ 24న బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల ప్రచారమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం

ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పలుమార్లు ప్రధాని మోడీ బీహార్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అంతేకాకుండా మహిళల ఖాతాలో రూ.10,000 జమ చేశారు. ఇక ఎన్నికల సమరానికి సమయం తక్కువగా ఉండడంతో ఈనెల 24 నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: 143 మందితో జాబితా విడుదల చేసిన ఆర్జేడీ

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. ఇండియా కూటమి మాత్రం విడివిడిగా పోటీ చేస్తోంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు విపక్ష కూటమి కలిసే ఉంది. ఓటర్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సీట్ల పంపకాలలో తేడానో.. లేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తిరకాసో తెలియదు గానీ.. చివరి నిమిషంలో ఇండియా కూటమి చీలిపోయింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంతంగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న విపక్ష కూటమి కలలు కల్లలైనట్లుగానే కనిపిస్తున్నాయి. విపక్ష కూటమి చీలికను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది. ఆయా హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది.

ఇది కూడా చదవండి: PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

Exit mobile version