Site icon NTV Telugu

J&K Assembly Poll: నేడు కాశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన.. శ్రీనగర్ లో ఎన్నికల ర్యాలీ..

Modi

Modi

J&K Assembly Poll: నేడు కాశ్మీర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. అందులో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని అందించడానికి ప్రధాని ఈరోజు (గురువారం) శ్రీనగర్‌లో నిర్వహించే ఎన్నికల మెగా ర్యాలీలో ప్రసంగించడానికి వస్తున్నారు. ఆ తర్వాత కత్రాలోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రధాని శ్రీనగర్ ర్యాలీ బీజేపీకి చాలా కీలకం కానుంది. ప్రత్యర్థి పార్టీల కంచుకోటలో బీజేపీ పునాదులను పటిష్టం చేసి అక్కడ వికసించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేసింది.

Read Also: Blast : బహదూర్‌పురలోని ఓ ఇంట్లో పేలుడు.. ఏడుగురికి గాయాలు

అలాగే, జమ్మూ డివిజన్‌లో బలంగా ఉన్న బీజేపీ కశ్మీర్‌లోని గురేజ్, కర్నా, షోపియాన్, హబ్బకదల్, పహల్గాం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు రచిస్తుంది. కాశ్మీర్‌లో 19 మంది బీజేపీ అభ్యర్థుల్లో 8 మంది భవితవ్యం నిన్న (బుధవారం) ఈవీఎంలలో దాగి ఉంది. ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీనగర్‌లో జరిగే తన మెగా ర్యాలీలో రెండవ, మూడవ దశలో జరిగే ఎన్నికలలో పోటీ చేసే 11మంది పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ.

Exit mobile version