Site icon NTV Telugu

PM Modi: పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ..

PutiN Modi

PutiN Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. భారతదేశం-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు సమీక్షించారు.

Read Also: Indian Fishermen: మరో 10 మంది భారతీయ మత్స్యకారులని అరెస్ట్ చేసిన శ్రీలంక.. వరసగా రెండో సంఘటన..

ఇరు దేశాల ప్రయోజనాలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇద్దరు చర్చించారు. 2024లో రష్యా బ్రిక్స్ అధ్యక్ష పదవికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్‌కి ప్రధాని హామీ ఇచ్చారు. అంతకుముందు డిసెంబర్ 2023లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించారు. ఆదేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో పాటు పుతిన్‌తో కూడా భేటీ అయ్యారు. రష్యా, భారతదేశానికి ‘‘విలువైన టైమ్ టెస్టెడ్ పార్ట్‌నర్’’ అని జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ రష్యా నుంచి విరివిగా చమురును కొనుగోలు చేసింది.

Exit mobile version