PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్‌లో మోడీ ఎదుట యోగా చేసిన చిన్నారులు.. వీడియో వైరల్

Modi2

Modi2

స్లోవేకియాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం మోడీ స్లోవేకియా వెళ్లారు. బ్రాటిస్లావాలో మోడీకి ఘన స్వాగతం లభించింది. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఘన స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.

×
×
Ad

అనంతరం స్లోవేకియాలోని బ్రాటిస్లావాలో ఉన్న అధ్యక్ష భవనంలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనాన్ని కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక యోగా సెషన్‌ను కూడా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ప్రతిష్ఠాత్మకమైన బ్రాటిస్లావా కోటలో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని ఫికోకు ధన్యవాదాలు. భారత్-స్లోవేకియా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేము కలిసి పనిచేస్తూనే ఉంటాం” అని పేర్కొన్నారు.