Site icon NTV Telugu

PM Modi: జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు.. అచ్యుతానందన్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన మోడీ

Modi

Modi

కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్.అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతానందన్ జీవితమంతా ప్రజా సేవకే అంకితం అయిపోయిందని.. కేరళ పురోగతికి జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు జరిగిన సంభాషణలను మోడీ గుర్తుచేశారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మద్దతుదారుల పట్ల మోడీ విచారం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్‌లైన్!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్.అచ్చుతానందన్ (101) సోమవారం తుదిశ్వాస విడిచారు. తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ

2019లో స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ప్రజా జీవితం నుంచి వైదొలిగారు. ఆనాటి నుంచి తిరువనంతపురంలోని తన కుమారుడు అరుణ్ కుమార్ నివాసంలోనే జీవితాన్ని గడిపారు. కేరళ కమ్యూనిస్ట్ ఉద్యమానికి అచ్చుతానందన్ ఇనుప దవడలాంటి వారు. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్ట్ నేత. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక మందికి ఆదర్శంగా నిలిచారు.

1923లో అలప్పుజలోని పున్నప్రలో వ్యవసాయ కార్మికులు కుటుంబంలో అచ్యుతానందన్ జన్మించారు. జీవితంలో అనేక ఒడుదుడుకులు, కష్టాలు అనుభవించారు. పేదరికం కారణంగా వ్యక్తిగతం అనేక ఇబ్బందులు పడ్డారు. అచ్యుతానందన్ చిన్నతనలంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 16 ఏళ్ల వయసులో ప్రముఖ కమ్యూనిస్ట్ నేత పి.కృష్ణ పిళ్లై సలహాతో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టారు. కృష్ణ పిళ్లైను గురువుగా భావిస్తారు.

 

Exit mobile version