NTV Telugu Site icon

PM Modi: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మోడీ సఫారీ.. ప్రకృతిని కాపాడాలని పిలుపు

Modi

Modi

భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను మోడీ పోస్టు చేశారు. ఇక గుజరాత్‌లోని మూడు రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సపారీ చేశారు. పర్యటనలో భాగంగా ఆయన లయన్‌ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు వెంట ఉన్నారు. అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు మోడీ తెలిపారు.

పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం జామ్‌నగర్‌లోని రిలయన్స్‌కి చెందిన ఫారెస్ట్‌ను మోడీ సందర్శించారు. అలాగే సోమనాథ్ ఆలయాన్ని దర్శించారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ అతిథి గృహమైన సిన్హ్ సదన్‌లో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున గిర్‌ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.