Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత అవార్డు..

Pm Modi

Pm Modi

PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని ఆ దేశం అత్యున్నత పౌరపుస్కారంతో గౌరవించింది. ‘‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ని ప్రధాని అందుకున్నారు. భారత్-రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని పెంపొందించడంలో ప్రధాన మోడీ చేసిన అత్యున్నత ప్రయత్నాలకు గానూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పురస్కారాన్ని అందించారు.

Read Also: Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నేతగా మోడీ రికార్డు సృష్టించారు. “ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. నేను దానిని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా యొక్క అత్యున్నత దేశ పురస్కారం.

“ప్రియమైన మిత్రమా, ఈ అత్యున్నత రష్యన్ అవార్డుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం, విజయాలు, మంచి జరగాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోని స్నేహపూర్వక ప్రజల శాంతి, శ్రేయస్సుని కోరుకుంటున్నాను..” అని అవార్డు ప్రధానోత్సవంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

Exit mobile version