NTV Telugu Site icon

PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ

Pmmodi

Pmmodi

2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాదిలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా సాధించిన ఘనతలను పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం దగ్గర నుంచి ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెన వరకు… ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!

2024 సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించామని.. ఇదే ఐక్యతతో పని చేస్తే వికసిత్ భారత్ సాధించడం ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తుచేస్తూ.. ఒక వీడియోను ఎక్స్‌ ట్విట్టర్‌లో ప్రధాని మోడీ పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి:Game Changer: గేమ్ ఛేంజెర్ రన్ టైం లాక్.. సెన్సార్ టాక్ షేక్!

ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక దేశంలోనే టూరిస్ట్ ప్లేస్‌గా అయోధ్య రికార్డ్ సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే తాజ్‌మహల్ కంటే ఎక్కువగా అయోధ్యనే సందర్శించినట్లుగా ఇటీవల గణాంకాలు విడుదలయ్యాయి. అలాగే ముంబైలో ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

Show comments