PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి

  • పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తి
  • పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
  • ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధాని హెచ్చరిక
Modi

Modi

పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తైంది. కుటుంబాలతో పహల్గామ్‌లో విహరిస్తుండగా హఠాత్తుగా ఉగ్ర మూకలు విరుచుకుపడి మతం పేరుతో 26 మంది పురుషులను పొట్టనపెట్టుకున్నారు. ఏడాది నుంచి 26 కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ పహల్గామ్ బాధితులను స్మరించుకున్నారు. బాధితులకు నివాళి అర్పించారు. గతేడాది ఇదే రోజున పహల్గామ్ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. వారిని ఎప్పటికీ మరిచిపోలేమని.. నష్టపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఒక దేశంగా ఐక్యంగా ఉన్నామన్నారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదానికి తలొగ్గదని.. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావన్నారు.

ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ

గతేడాది ఇదే రోజున హిందువులను టార్గెట్‌గా చేసుకుని 26 మంది పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. భార్య, పిల్లల ముందే చంపేశారు. కొత్తగా పెళ్లైన జంటలను కూడా వదిలిపెట్టకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. మొత్తానికి నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం పహల్గామ్‌లో కాల్పులకు తెగబడ్డ ముష్కరులను కూడా భద్రతా దళాలు అంతమొందించాయి.