NTV Telugu Site icon

PM Modi: దివ్యాంగ బాలుడి మాటలు విని ముచ్చటపడిన ప్రధాని మోదీ

Pm Modi

Pm Modi

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో డిజిటల్ భారత్ వీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగ బాలుడితో ముచ్చటించిన మోదీ.. అతని మాటలు చూసి ముచ్చటపడిపోయారు. దృష్టి లోపం ఉన్న వారి సాధారణ జీవితాన్ని సులభతరం చేసేందుకు రూపొందించిన ఓ ఉత్పత్తికి.. దృష్టి లోపంతో బాధపడుతున్న బాలుడు ప్రథమేశ్ సిన్హా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్‌ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ‘యాన్నీ’ అనే గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. ‘యాన్నీ’ గ్యాడ్జెట్ గురించి ప్రత్యక్షంగా ప్రథమేశ్ సిన్హా ప్రధానికి వివరించాడు. దీన్ని ప్రధాని ఆసక్తిగా విని అతడి తలను నిమిరారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చావంటూ ప్రశ్నించారు. పుణె నుంచి వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు. ప్రధాని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఆ బాలుడి గురించి ప్రస్తావించారు. తాను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న తీరు అబ్బురపరిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందనే విశ్వాసం మరింత పెరుగుతుందని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.

Rajyasabha: రాజ్యసభకు త్రిపుర సీఎం రాజీనామా.. ఖాళీగా మరో సీటు

తన బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రథమేష్ సిన్హా ‘యాన్నీ’ గురించి ప్రధానికి వివరిస్తున్న వీడియోను థింకర్ బెల్ ల్యాబ్స్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. తమ ఉత్పత్తి గురించి గౌరవ ప్రధానినరేంద్ర మోదీకి ప్రథమేష్ సిన్హా వివరించడం గర్వకారణమని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments