NTV Telugu Site icon

Bhutan King: ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ భేటీ

Pm Modi Meets Bhutan King

Pm Modi Meets Bhutan King

PM Modi Meets Bhutan King Jigme Khesar Namgyel Wangchuck: భారత్, భూటాన్ దేశాల మధ్య మరింతగా బంధం బలపడనుంది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌ భారతదేశంలో పర్యటిస్తున్నారు. బుధవారం భూటాన్ రాజు వాంగ్ చుక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు వాంగ్ చుక్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో భేటీ అయ్యారు. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కూడా భేటీ కానున్నారు వాంగ్ చుక్. మంగళవారం రోజు భూటాన్ అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

భారత్- భూటాన్ దేశాల మధ్య దశాబ్ధాల కాలం నుంచి సన్నిహిత, స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారత్ రక్షణకు భూటాన్ కూడా కీలకంగా ఉంది. 1968 భూటాన్ రాజధాని థింపులో భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా విస్తరించాయమి. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని.. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని గతంలోొ ఒప్పందం ఉండేది.. అయితే దీన్ని 2007లో సవరించారు. భూటాన్ విదేశాంగ విధానానికి మార్గదర్శకం చేయడానికి భారతదేశాన్ని భూటాన్ అనుమతించింది. రెండు దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాల్లో సన్నిహితంగా సంప్రదించుకుంటాయి.

Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?

భద్రత, సరిహద్దు, వాణిజ్యం, రవాణా, ఆర్థిక, జలశక్తి, నీటి వనరుల మొదలైన వారిపై భారత్, భూటాన్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి. భూటాన్, భారత్ లోని నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , సిక్కిం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి కారిడార్, చికెన్ నెక్ రక్షణకు భూటాన్, భారత దేశానికి అత్యంత కీలకమైనది. 22 కిలోమీటర్ల వెడల్ప ఉండే ఈ చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను ఇతర భారతదేశంతో కలుపుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు కూడా ఈ చికెన్ నెక్ కు సరిహద్దుల్లోనే ఉన్నాయి.

గతంలో డోక్లామ్ సరిహద్దు వివాదంలో చైనాకు భారత బలగాలు ఎదురొడ్డి నిలుచున్నాయి. కొన్ని రోజులు పాటు చైనా- ఇండియా బలగాలు ఎదురెదురుగా మోహరించాయి. 1972 నుంచి భూటన్ కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే భారత్, భూటాన్ దేశానికి మూడు జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి ఇచ్చింది. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా భారత్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన మొదటి దేశం భూటానే. తాజాగా భూటాన్ రాజు భారత పర్యటన చాలా కీలకంగా మారింది. ఇరు దేశాల మధ్య మరిన్ని దైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.