Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: ప్రధాని మోడీ “నీలకంఠుడు”.. విషసర్పం విమర్శలకు కౌంటర్..

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని మోడీని ‘విషసర్పం’తో పోల్చడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని శివుడి(నీలకంఠుడు)తో పోల్చారు. ప్రధాని దేశ ప్రజల కోసం విషాన్ని భరిస్తున్నారని అన్నారు. ప్రధాని సుసంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.

Read Also: MLA Bhupal Reddy : బస్తీమే సవాల్ కోమటిరెడ్డి.. బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..

కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రధాని మోడీపై విషప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. క్షీరసాగర మథనంలో సముద్రం నుంచి ఉద్భవించిన విషాన్ని పరమ శివుడు గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడు, గరళకంఠుడు అనే పేర్లతో శివుడ్ని పిలుస్తారు. కలబురిగిలో జరిగిన ఓ సభలో గురువారం ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విష సర్పం లాంటి వారని విమర్శించారు. ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే మరణం తధ్యం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఖర్గే వెనక్కి తగ్గారు. తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం విషంతో సమానం అని వ్యాఖ్యానించానని, ప్రధానిని వ్యక్తిగతంగా దూషించలేదని అన్నారు.

Exit mobile version