PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
- రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు.. నేను కూడా మాట్లాడను
- తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది : ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Telangana Visit: తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొని, రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన భారీ వరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. గుడెబల్లూర్ – మహబూబ్‌నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ పురోగతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయమైనది. దేశాభివృద్ధిలో నగరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్‌టైల్స్ రంగానికి ఊతమిస్తుంది. ఇది దేశీయ వస్త్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుంది. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. 2014 ముందు ఏపీకి వెయ్యి కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. రూ.15 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు, నేను కూడా మాట్లాడను. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?