NTV Telugu Site icon

Yunus-Modi: మోడీకి బంగ్లాదేశాధినేత యూనస్‌ ఫోన్.. దేనికోసమంటే..!

Pmmodi

Pmmodi

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశాక… మైనారిటీలు, హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఫోన్‌ కాల్ చేశారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు’’ అని ఎక్స్ ట్విట్టర్ వేదికగా మోడీ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో కోటా ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారడంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ప్రధాని షేక్‌హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడి.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అల్లర్ల సందర్భంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం పలు సంస్కరణలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది.