Site icon NTV Telugu

PM Modi-Ayodhya: అయోధ్య రామాలయంపై కాషాయ జెండా ఆవిష్కరించిన మోడీ

Ayodhya

Ayodhya

అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

‘‘ధ్వజ్ ఆరోహణ్’’ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.

ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్‌ మధ్య కీలక సంభాషణ.. ఏప్రిల్‌లో చైనాలో పర్యటన

 

 

Exit mobile version