Site icon NTV Telugu

PM Narendra Modi: అంబులెన్స్‌కు దారివ్వడానికి ఆగిపోయిన ప్రధాని కాన్వాయ్

Pm Narendra Modi Convay

Pm Narendra Modi Convay

PM Modi halts his convoy to give way to ambulance after Himachal rally: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాన్ని పెంచింది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం పర్యటించారు. సుజన్ పూర్, చాంబిలలో ఈ రోజు జరగనున్న బహిరంగ సభల్లో ప్రసంగించారు. బహిరంగసభ ముగిసిన తర్వాత కాంగ్రాలోని ర్యాలీ గ్రౌండ్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో అంబులెన్సుకు దారి ఇచ్చారు. అంబులెన్సుకు దారి ఇవ్వడం కోసం ప్రధాని మోదీ తన కాన్వాయ్ ను అపారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత మళ్లీ కాన్వాయ్ ముందుకు కదిలింది. మోదీ హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా కన్వాయ్ కు అంబులెన్స్ అడ్డుగా వచ్చింది.

Read Also: Strict Restrictions in Vizag: ప్రధాని మోడీ వైజాగ్‌ పర్యటన.. ఆకాశ మార్గంలోనూ ఆంక్షలు

ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతతో పాటు అభివృద్ధికి విరుద్ధం అని ఆరోపించారు. గత వారం నవంబర్ 5న, సుందర్ నగర్, సోలన్ లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నికలకు కొన్ని రోజులే ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోసారి హిమాచల్ ప్రదేశ్ లో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా వరసగా హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోలేదు. అయితే ఈ చరిత్రను తిరిగిరాయాలని బీజేపీ భావిస్తోంది.

Exit mobile version