Site icon NTV Telugu

PM Modi: నేపాల్ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడిన మోడీ.. ఏం చర్చించారంటే..!

Modi8

Modi8

నేపాల్ ప్రధాని సుశీలా కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నకున్నారు.

గురువారం సుశీలా కర్కితో ప్రధాని మోడీ ఫోన్‌లో సంభాషించారు. ఇటీవల జరిగిన విషాదకరమైన ప్రాణనష్టంపై మోడీ సంతాపం వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. నేపాల్ ప్రధాని సుశీలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. అలాగే శుక్రవారం నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీలకు, నేపాల్ ప్రజలకు మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు మోడీ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Rajasthan: ప్రియుడి కోసం ఓ ఇల్లాలు దుశ్చర్య.. అడ్డుగా ఉందని 3 ఏళ్ల చిన్నారిని చంపేసిన తల్లి

ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల మాట్లాడుతూ.. 6 నెలలు కంటే ఎక్కువ కాలం అధికారం అంటిపెట్టుకుని ఉండటానికి రాలేదని చెప్పారు. 6 నెలల్లో కొత్త పార్లమెంట్‌కు బాధ్యతలు అప్పగిస్తామని బాధ్యతలు స్వీకరించిన సమయంలో సుశీల చెప్పుకొచ్చారు. నేపాల్‌లో 2026, మార్చి 5న కొత్త ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Tamil Nadu: దక్షిణాదికొస్తే కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిండి.. దుమారం రేపుతోన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

కేపీ శర్మ ఓలి ప్రభుత్వ.. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది యువతలో ఆగ్రహాన్ని రగిలించింది. జెన్-జెడ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఖాట్మండులో భారీగా నిరసనకారులు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘర్షణల్లో 19 మంది నిరసనకారులు చనిపోయారు. ఒక మాజీ ప్రధాని భార్య సజీవదహనం అయింది. అనంతరం కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అటు తర్వాత సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.

 

Exit mobile version