NTV Telugu Site icon

PM Modi: 45 ఏళ్ల తర్వాత పోలెండ్ పర్యటనకు ప్రధాని మోడీ..

Modi

Modi

PM Modi: యూరోపియన్ దేశం పోలెండ్ పర్యటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. ఓ భారత ప్రధాని పోలెండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, మధ్య యూరప్ దేశాల్లో పోలెండ్ దేశం భారత్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. పోలెండ్ కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్ లో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అటు, పోలెండ్ లో భారత్ కు చెందిన 5 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.

Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..

ఇక, పోలెండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ దేశం వెళ్లనున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మోడీ సమావేశం కానున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో.. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతుండటంతో నరేంద్ర మోడీ పర్యటనపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది. ఇప్పుడు మోడీ కూడా జెలెన్ స్కీతో జరిగే సమావేశంలో అదే వైఖరికి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.