PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
- మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం
- సామాన్య ప్రయాణికుడిలా జర్నీ
- చిన్నారులు, ప్రయాణికులతో ముచ్చట్లు
- Follow Us :

Add as a preferred
source on google
ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయిపోయారు. రొటిన్‌కు భిన్నంగా శనివారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలో ప్రయాణించి కాలేజీకి వెళ్లారు. చేతిలో మెట్రో కార్డు పట్టుకుని ప్రయాణించిన ప్రధాని.. మార్గమధ్యంలో విద్యార్థులు, తోటి ప్రయాణికులతో సరాదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మెట్రోలో మోడీ ముచ్చట్లు
SRCC 100వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించేందుకు వెళ్లిన ప్రధాని మోడీ.. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ఉన్న చిన్నారులతో…విద్యార్థులతో.. ఇతర ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోలో కనిపించే సాధారణ దృశ్యానికి.. ప్రధాని మోడీ ప్రయాణం ప్రత్యేకతను తీసుకొచ్చింది. కాలేజీకి చేరుకునే క్రమంలో ఆయన పలువురితో ఆప్యాయంగా మాట్లాడారు.
Also Read
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
SRCCకి 100 ఏళ్లు
ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమం SRCCకి ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ తన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. SRCC శతాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుత విద్యార్థులతో పాటు కాలేజీ మాజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో SRCC శతాబ్ది వేడుకలు పలు తరాల విద్యార్థులు, అధ్యాపకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయి.
13 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీలోకి..
SRCCలో ప్రధాని మోడీ పర్యటించడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన చివరిసారిగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో SRCCని సందర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో SRCC శతాబ్ది వేడుకల సందర్భంగా కాలేజీ గవర్నింగ్ బాడీ, ప్రతినిధి బృందాన్ని ప్రధాని మోడీ తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా SRCC 100 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు. ఇప్పుడు నెలల తర్వాత ప్రధాని స్వయంగా SRCCకి చేరుకున్నారు. మెట్రో కార్డు చేతిలో పట్టుకుని విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఆయన చేసిన ఈ ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi traveled by the Delhi Metro today as he headed to Shri Ram College of Commerce (SRCC) to participate in the college's centenary celebrations.

(Source: DD) pic.twitter.com/AVqtS38z6P
— ANI (@ANI) September 5, 2026

తాజావార్తలు

Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..

Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!

El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!

John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!

LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్

రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!

Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!

Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!

Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!

IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!