Site icon NTV Telugu

PM Modi: నితీష్ నాయకత్వంలో మళ్లీ విజయం సాధిస్తాం.. మోడీ సంచలన ప్రకటన

Pmmodi1

Pmmodi1

మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమి వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తాజాగా మోడీ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ నాయకత్వంలో తిరిగి బీహార్‌లో విజయం సాధిస్తామని మోడీ ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అన్నట్టుగా అర్థమిస్తోంది.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ

నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో ఎన్డీఏ తన రికార్డును తానే బద్దలు కొడుతుందని.. అతిపెద్ద మెజారిటీని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాట పూర్తి నమ్మకంతో చెబుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏకు ఇప్పటివరకు లేని విధంగా అతిపెద్ద ఆధిక్యతను సాధించబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఆత్మాహుతి కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

‘‘మహారాష్ట్ర ప్రజలు మాకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. హర్యానా కూడా అదే చేసింది. మూడవసారి మమ్మల్ని ఎన్నుకుంది. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ చాలా కాలంగా అధికారంలో ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఇదే చూశాము. గుజరాత్‌లో బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ ఆ ధోరణిని అంతం చేసింది. ఇవన్నీ ఎన్డీఏ మంచి పాలన, ప్రజా సేవ, హామీ ఇచ్చిన అభివృద్ధి కోసం నిలుస్తుందని చూపిస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ బీహార్‌లో తన రికార్డును తానే బద్దలు కొడుతుందని.. పూర్తి నమ్మకంతో చెప్పగలను.’’ అని మోడీ అన్నారు.

మహారాష్ట్ర, హర్యానాలో పునరావృతం అయినా విజయాన్ని బీహార్‌లో కూడా పునరావృతం చేయాలని కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఇందుకోసం ఎన్డీఏ కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. మహాఘట్‌బంధన్‌లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే అవినీతి, దోపిడీలేనని వ్యాఖ్యానించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిలు తలపడుతున్నాయి.

Exit mobile version