Site icon NTV Telugu

PM Modi: దేశాభివృద్ధికి బీహారే కీలకం.. మెగా ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోడీ

Modi

Modi

దేశాభివృద్ధికి బీహారే కీలకమన ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం మోడీ బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయుల ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ప్రధాని మోడీ గత ఐదు నెలల్లో బీహార్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌పై మోడీ ఫోకస్ పెట్టారు.

ఇది కూడా చదవండి: Anchor Shyamala: పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా?.. ప్లకార్డ్ ప్రదర్శించిన శ్యామల!

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. అధికార కోసం ఆరాటపడేవారు.. తమ సొంత కుటుంబాలను ప్రోత్సహించడంపైనే దృష్టి పెడతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దోచుకునే పార్టీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. దేశంలో పేదరికానికి కాంగ్రెస్సే కారణం అన్నారు. దీనికి దళితులు, వెనుకబడిన వర్గాలే.. ఇందుకు అతి పెద్ద బాధితులని చెప్పుకొచ్చారు. ఇక అంబేద్కర్‌ను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బీహార్ వ్యతిరేక.. పెట్టుబడి వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. ఆ పార్టీలు కారణంగానే బీహార్ పేదరికంలో ఉందని ఆరోపించారు. బీహార్ ప్రజలే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వలసదారులుగా వెళ్లిపోయారన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: RajaSaab : ప్రభాస్‌ సినిమా ‘రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌పై ఫిర్యాదు.

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. రెండు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version