Site icon NTV Telugu

Sansad Ratna Awards: విజయసాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న’అవార్డు.. ప్రధాని మోడీ అభినందనలు

Sansad Ratna Awards

Sansad Ratna Awards

Sansad Ratna Awards: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది సన్‌సద్‌ రత్న అవార్డు విజేతలను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. ఈ అవార్డుకు ఎంపిక అయిన ఎంపీల జాబితాను విడుదల చేశారు.. అందులో విజయసాయిరెడ్డికి చోటు దక్కింది.. సాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తోన్న విషయం విదితమే.. మరోవైపు.. ఈ అవార్డుకు ఎంపికైన పార్లమెంట్‌ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు..

Read Also: Pawan Kalyan Donation: కార్యకర్తలకు బీమా.. పవన్‌ కల్యాణ్ రూ.కోటి విరాళం

కాగా, జ్యూరీ కమిటీ 2023 ఈఏడాదికి గాను.. 13 మంది ఎంపీలతో పాటు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది. సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీకే రంగరాజన్‌కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.. అవార్డు గ్రహీతలు.. బిద్యుత్ బరన్ మహతో (బిజెపి, జార్ఖండ్), సుకాంత మజుందార్ (బిజెపి, పశ్చిమ బెంగాల్), కుల్దీప్ రాయ్ శర్మ (ఐఎన్‌సి, అండమాన్ నికోబార్ దీవులు), హీనా విజయకుమార్ గావిట్ (బిజెపి, మహారాష్ట్ర), అధీర్ రంజన్ చౌదరి (ఐఎన్‌సి, పశ్చిమ బెంగాల్) ., గోపాల్ చినయ్య శెట్టి (బిజెపి, మహారాష్ట్ర), సుధీర్ గుప్తా (బిజెపి, మధ్యప్రదేశ్), మరియు అమోల్ రాంసింగ్ కోల్హే (ఎన్‌సిపి, మహారాష్ట్ర) లోక్‌సభ సభ్యులు కాగా.. రాజ్యసభ నుండి, జాన్ బ్రిట్టాస్ (CPI-M, కేరళ), మనోజ్ కుమార్ ఝా (RJD, బీహార్), ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (NCP, మహారాష్ట్ర), విషంభర్ ప్రసాద్ నిషాద్ (సమాజ్‌వాదీ పార్టీ, UP) మరియు ఛాయా వర్మ (INC, ఛత్తీస్‌గఢ్) ) ) సంసద్ రత్న అవార్డు ఇవ్వబడుతుంది.

Read ALso: Bandi Sanjay : పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి.. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

17వ లోక్‌సభ ప్రారంభం నుంచి 17వ తేదీ వరకు అత్యద్భుతంగా పనిచేసినందుకు గాను ఫైనాన్స్ కమిటీ (బీజేపీ జయంత్ సిన్హా ఆధ్వర్యంలో లోక్‌సభ), రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ) అవార్డులకు ఎంపికయ్యాయి. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. సన్‌సద్‌రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా ఉన్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్‌ టీఎస్‌ కృష్ణమూర్తి సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నామినేషన్లు 17వ లోక్‌సభ ప్రారంభం నుండి 2022 శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పార్లమెంటులో ఒక ఎంపీ యొక్క సంచిత పనితీరుపై ఆధారపడి ఉన్నాయని వెబ్‌సైట్ పేర్కొంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేట్ సభ్యుల బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది.

Exit mobile version