Site icon NTV Telugu

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగా గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులకు మోడీ అభినందనలు

Pmmodi

Pmmodi

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahesh Babu : ఫ్యాన్స్‌కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త

అలాగే ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఎక్స్ ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను మోడీ రీపోస్ట్‌ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor : జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ ఫొటోస్..

అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశంలో, రాష్ట్రంలో మరిన్ని విజయాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి దక్కుతుందని పేర్కొన్నారు.

 

Exit mobile version