NTV Telugu Site icon

PM Modi: పార్లమెంట్ ఘటన దురదృష్ణకరం: ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అత్యంత సీరియస్ చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఘటనను తక్కువగా అంచనా వేయవద్దని ప్రధాని అన్నారు. ‘‘ పార్లమెంట్‌లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల స్పీకర్ అత్యంత సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని చెప్పినట్లు నేషనల్ మీడియా కథనాలను ప్రచురించింది.

Read Also: Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…

‘‘ దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషణ కూడా ఓపెన్ మైండ్‌తో చేయాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి’’ అని ప్రధాని మోడీ సూచించారు.

డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడికి 22 ఏళ్ల పూర్తయిన రోజే ఆరుగురు నిందితులు పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపల, ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ వెలుప పొగడబ్బాలతో హంగామా చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.