Site icon NTV Telugu

PM Modi: అభిమానికి పాదరక్షలు తొడిగిన మోడీ.. ఆసక్తికర విశేషమేంటంటే..!

Modi

Modi

అంబేద్కర్ జయంతి రోజున హర్యానాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ప్రధాని మోడీ హర్యానాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక అభిమానిని ప్రధాని మోడీ కలిశారు. అంతేకాదు.. ఆ అభిమానికి స్వయంగా మోడీనే పాదరక్షలు తొడిగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది. అతడు అంత ప్రత్యేకం ఏంటి? మోడీనే స్వయంగా ఎందుకు తొడిగించారో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Madarasi: సెప్టెంబర్ 5న ‘మదరాసి’ వరల్డ్ వైడ్ రిలీజ్

హర్యానాలోని కైతాల్ ప్రాంతం. రాంపాల్ కశ్యప్.. మోడీ అభిమాని. మోడీ ప్రధాని అయ్యే వరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ బూనాడు. ఆ నాటి నుంచి పాదరక్షలు ధరించకుండానే నడుస్తున్నాడు. ఇప్పటికి 14 ఏళ్లు అయింది. ఇక మోడీ ప్రధాని అయి కూడా పదేళ్లు దాటింది. అయినా కూడా రాంపాల్ ఈనాటికి పాదరక్షలు లేకుండానే తిరుగుతున్నాడు. అయితే విషయం మోడీ దృష్టిలో పడింది. సోమవారం హర్యానాలో మోడీ పర్యటన ఉంది. అంతే అతడి కోసం మోడీ ‘షూ’ తీసుకొచ్చారు. పర్యటనలో భాగంగా రాంపాల్‌ను మోడీ పిలిపించారు. పాదరక్షలు ధరించాలని కోరారు. అందుకు అతడు ససేమిరా అన్నాడు. ధరించాలంటూ మోడీ బలవంతం చేశారు. మొత్తానికి రాంపాల్ ఒప్పుకోవడంతో స్వయంగా అతడికి బూట్లు ధరింపజేశారు. ఈ సందర్భంగా అతడి యోగక్షేమాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. మోడీ చూపించిన ప్రేమకు అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

 

Exit mobile version