పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోడీ బ్యారక్‌పూర్ ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి బహిరంగ సభ. మే 4వ తేదీ ఫలితాల అనంతరం జరిగే బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కచ్చితంగా హాజరవుతాననే పూర్తి విశ్వాసంతో నేను తిరిగి వెళ్తున్నాను. ఆ విశ్వాసమే నా ఉత్సాహాన్ని మరింత రెట్టింపుజేస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు.
‘‘నేను హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి వస్తుండగా సుమారు రెండు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా ప్రజల భారీ సమూహం కనిపించింది. ఇంత పొద్దున్నే వేల సంఖ్యలో ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి తరలివస్తారని నేను కలలో కూడా ఊహించలేకపోయాను.’’ అని అన్నారు.
బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. 142 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత పోలింగ్‌లో దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి విడతలో కూడా భారీగా పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు బెంగాల్‌తో పాటు తూర్పు భారతదేశం భవిష్యత్తును మార్చివేస్తాయి. గతంలో భారతదేశం సుసంపన్నంగా వెలుగొందినప్పుడు.. దానికి మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. అంగ, వంగ, కళింగ. అంటే బీహార్, బెంగాల్, ఒడిశా. నేడు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆ లక్ష్య సాధన కోసం అంగ, వంగ, కళింగ ప్రాంతాలు బలంగా ఉండటం అత్యవసరం..’’ అని అన్నారు.
#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "This is my last rally in this election. I'm going back with the confidence that I will definitely attend the BJP's swearing-in ceremony after the May 4th results. And that only increases my enthusiasm."
"I… pic.twitter.com/vE5xjLjKb1
— ANI (@ANI) April 27, 2026
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi felicitated as he takes the stage during a public rally in Barrackpore.#WestBengalAssemblyElections pic.twitter.com/US0bKf2a9f
— ANI (@ANI) April 27, 2026
#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "This election in West Bengal will change the destiny of Bengal as well as eastern India. In the past, when India was prosperous, it had three strong pillars: Anga, Banga, and Kalinga—meaning Bihar, Bengal, and… pic.twitter.com/fJAI8JAbvf
— ANI (@ANI) April 27, 2026
