ASEAN Summit: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆసియాన్ (ASEAN) సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకంగా అలంకరించిన ఒక ఆటో రిక్షాలో ప్రయాణించడంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మోడీ ప్రయాణించిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పాకిస్తాన్‌తో తయారైందని ఆ దేశ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, దీంట్లో నిజం లేదని తేలింది. మోడీ ప్రయాణించిన ఆటోను భారత ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తయారు చేసినట్లు స్పష్టమైంది. నవంబర్ 17న మనీలాలో జరిగిన సమావేశం నేపథ్యంలో ఆ దేశం విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు ప్రపంచదేశాల నాయకుల్ని ప్రత్యేకంగా అలంకరించిన ఆటో రిక్షాల్లో చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని సంప్రదాయ జీప్నీ వాహనాల కళారూపాలను పోలిన రంగురంగుల చిత్రాలతో వీటిని అలంకరించారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ వాహనాలను ఏర్పాటు చేసింది.
పాకిస్తాన్‌లో ఫేక్ ప్రచారం..
మోడీ ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంతో పాకిస్తాన్‌కు చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ ఆటో పాకిస్తాన్‌లో తయారైందని ప్రచారం చేశారు. లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ హమ్మద్ హసన్ కూడా ఇది మేడ్ ఇన్ పాకిస్తాన్ ఆటో రిక్షా అని పోస్ట్ పెట్టారు. అయితే, ఈ వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై బజాజ్ లోగో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ వాహనం భారతీయ సంస్థ బజాజ్ ఆటో తయారు చేసిందని వెల్లడైంది.
ఈ గందరగోళం ఎందుకు..?
పాకిస్తాన్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ సాజ్‌గర్ తగ నెలలో ఫిలిప్పీన్స్‌లోని లగువా ప్రాంతంలో తన తొలి విదేశీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆగ్నేయాసియాలో తన మార్కెట్ విస్తరించాలని కోరుకుంటోంది. అయితే, ఆసియాన్ సదస్సులో మాత్రం ప్రపంచదేశాధినేతలు ప్రయాణించిన ఆటోలు మాత్రం బజాజ్ కంపెనీకి చెందినవే. పాకిస్తాన్ తప్పుడు ప్రచారంపై భారత యూజర్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. వాహనంపై బజాజ్ లోగోను చూపించి పోస్టులు పెడుతున్నారు.
బజాజ్‌కు ఫిలిప్పీన్స్ మంచి మార్కెట్..
బజాజ్ ఆటో 2015లోనే ఫిలిప్పీన్స్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి అక్కడ త్రీవీలర్ మార్కెట్‌లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ దేశంలో అసెంబ్లీ యూనిట్లు, డీలర్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకుంది. బజాజ్ ఆటో తన వాహనాలను 70కి పైగా విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
The Bajaj auto that was used at the Asean summit.
PM Modi, world leaders travelled on these autos to the Asean Gala dinner summit venue yesterday https://t.co/ClqS5Yxph2
— Sidhant Sibal (@sidhant) November 17, 2026

