NTV Telugu Site icon

G-20 Summit: బ్రెజిల్‌ చేరుకున్న భారత ప్రధాని.. జీ-20 సదస్సులో పాల్గొననున్న మోడీ

Modi

Modi

G-20 Summit: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్‌ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున బ్రెజిల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. జీ-20 సదస్సులో భాగంగా నేడు పలు దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది.

Read Also: Samantha old Video: సమంత 14 ఏళ్ల కిందటి వీడియో వైరల్.. ఎలా ఉందో చూడండి

అలాగే, జీ-20 సదస్సు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్​ ఇర్ఫాన్​ అలీ అహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న ఇండియా- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్​ ఆఫ్​ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ప్రదానం చేయనున్నారు. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటిస్తున్నారు.