NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్.. కీలక అంశాలపై చర్చ..!

Modi

Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఇటీవల, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై మోడీతో జో బైడెన్ చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీ ఇటీవలే పర్యటించారు. చారిత్రాత్మక ఈ పర్యటన ముగిసిన నేపథ్యంలో మోడీకి జో బైడెన్ ఫోన్ చేశారు.

Read Also: Daily Habits Effect Obesity: అలర్ట్.. ఈ అలవాట్లు ఉన్నాయా..? ఊబకాయం బారిన పడినట్లే..

అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ వెల్లడించారు. ఇవాళ ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడా.. ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై వివరణాత్మక అభిప్రాయాలను ఇద్దరం పంచుకున్నాం.. శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై కూడా చర్చకు వచ్చింది.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతపై తాము చర్చించాం.. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.