NTV Telugu Site icon

Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..

Bhupendra Patel

Bhupendra Patel

గుజరాత్‌లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకుంది.. 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది.. 2002లో 127 సీట్లు కైవసం చేసుకోగా.. 2007లో 117 స్థానలు.. 2012లో 115 స్థానాలు, 2017లో 99 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇప్పుడు 150 స్థానాలను దాటేసి 160 వైపు సాగుతుంది.. దీంతో, కమలం పార్టీ శిబిరంలో జోష్ పెరిగింది.. ఇక, మరోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు భూపేంద్ర పటేల్.. దీనికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు..

Read Also: Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్‌ వేళ.. ఇండియాలో హైరింగ్‌ హేల..

ఈ నెల 12న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకాబోతున్నారు.. 182 స్థానాలకు డిసెంబరు 1వ తేదీ,5వ తేదీ రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 158 స్థానాల్లో ఆధిక్యంతో బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ప్రత్యామ్నాయం మేమేన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపలేకపోయింది.. ఆప్‌తో పాటు ఎంఐఎం పోటీ చేయడం వల్లే.. కాంగ్రెస్‌కు సీట్లు తగ్గి.. బీజేపీకి అనూహ్యంగా సీట్లు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే, ఈ విజయంపై మీడియాతో మాట్లాడిన సీఎం భూపేంద్ర పటేల్.. తమ పార్టీకి లభించిన ప్రజాదరణతో తమ విమర్శకులు నివ్వెరపోతున్నారన్నారు.. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి లభించిన ప్రజాదరణ, ప్రజాతీర్పును వినయపూర్వకంగా స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎంతో ప్రేమిస్తున్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని తెలిపారు భూపేంద్ర పటేల్.

Show comments