NTV Telugu Site icon

PM Modi: ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది

Pmmodi

Pmmodi

దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు.

మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి.