NTV Telugu Site icon

అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు ప‌ట్టేది-ప్ర‌ధాని మోడీ

PM Modi

ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు అన్నారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ఆధునిక కాలంలో ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు.. గ‌త వందేళ్ల‌లో ఇదే అతిపెద్ద మ‌హ‌మ్మారి అన్నారు. క‌రోనాతో దేశ‌ప్ర‌జ‌లు ఎంతో బాధ అనుభ‌వించార‌న్న ఆయ‌న‌.. దేశ చ‌రిత్ర‌లో ఇంత మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఎప్పుడూ అవ‌స‌రం ప‌డ‌లేద‌న్నారు.. ఈ స‌మ‌యంలో దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని 10 రెట్లు పెంచామ‌ని వెల్ల‌డించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉప‌యోగించి ఆక్సిజ‌న్ కొర‌త తీర్చామ‌ని తెలిపారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇక‌, ప్ర‌పంచంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌లు చాలా త‌క్కువ‌న్న మోడీ.. మ‌నం వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసుకోక‌పోతే విదేశాల నుంచి రావ‌డానికి ఏళ్లు ప‌ట్టేద‌న్నారు.. వాళ్ల అవ‌స‌రాలు తీరాకే మ‌న‌కు వ్యాక్సిన్ ఇచ్చేవాళ్లు అని గుర్తుచేశారు..