PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?

  • పీఎం కిసాన్ 23వ విడత
  • రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ
  • 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా
Pm Kisan

Pm Kisan

కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సమాన వాయిదాలలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులు ఇప్పటివరకు 22 విడతలు అందుకున్నారు. 22వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13 అస్సాంలోని గౌహతి నుండి విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుండడంతో రైతులు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పీఎం కిసాన్ యోజన 23వ విడత ఎప్పుడు వస్తుంది?

మార్చిలో 22వ విడత అందిన తర్వాత, పీఎం కిసాన్ యోజన 23వ విడత 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పీఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న తర్వాత, ఇ-కేవైసిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీ ఇ-కేవైసి ప్రక్రియ అసంపూర్తిగా ఉండి, మీ ధృవీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తే, మీ తదుపరి వాయిదా ఆలస్యం కావచ్చు. మీ తదుపరి వాయిదాలో ఆలస్యాన్ని నివారించాలంటే, మీరు తప్పనిసరిగా ఇ-కేవైసిని పూర్తి చేయాలి.

పీఎం కిసాన్ యోజన కోసం ఇ-కేవైసి ఎలా చేయాలి?

ముందుగా, pmkisan.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
హోమ్ పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ‘ఇ-కెవైసి’ (e-KYC) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత, మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, OTPని సమర్పించండి.
రిజిస్టర్డ్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, ‘సమర్పించు’ (Submit) పై క్లిక్ చేయండి.
ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ స్క్రీన్‌పై ‘ఇ-కెవైసి విజయవంతమైంది’ (successful e-KYC) అనే సందేశం వస్తుంది.