Site icon NTV Telugu

PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..

Pm Modi

Pm Modi

PM Modi: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ మండుతుందని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు పాలించారు, కానీ 10 ఏళ్లు అధికారంలో లేకుంటే దేశాన్ని తగబెట్టేలా మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్య భాషా?? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌తో కాంగ్రెస్‌కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు. అందుకే వారు ఆదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు.

Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కూలిన వంతెన.. కార్మికులకు గాయాలు

ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నేతలు అరెస్టైన కేజ్రీవాల్‌కి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయని ఆరోపించారు. ఈవీఎంలు, సోషల్ మీడియా, ప్రెస్‌లపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180 సీట్లకు మించి గెలవడదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశం మొత్తం మండిపోతుందని, నా మాటలు గుర్తించండి అని రాహుల్ గాంధీ అన్నారు.

ఈ రోజు రుద్రపూర్ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రెండు క్యాంపుల మధ్య పోటీ ఉండబోతోందని, ఓ వైపు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత తీసుకొస్తున్నామని, మరోవైపు అవినీతిపరులు, దొరల ముఠా ఉందని అన్నారు. ఈ అవినీతిపరులు మోడీని తిట్టి, బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ అవినీతిని తొలగించాలని చెబితే, వారు అవినీతిపరులను రక్షించాలని చూస్తున్నారని ఇండియా కూటమిపై ఆరోపణలు చేశారు. తాను బెదిరింపులకు భయపడనని, అవినీతిపరులపై చర్యలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై పెద్దగా దాడి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

Exit mobile version