NTV Telugu Site icon

ఆ రాష్ట్రంలో కూడా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్ధు…

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేస్తు వ‌స్తున్నారు.  ఇటీవ‌లే  త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేసింది.  ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో పుదుచ్చేరి కూడా చేరింది.  విద్యార్ధుల‌కు కీల‌క‌మైన ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురుచూశామ‌ని, కానీ, క‌రోనా కార‌ణంగా ఇప్ప‌ట్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని, దీంతో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధుచేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.