Supreme Court: బెంగాల్ హింసపై సుప్రీంకోర్టులో పిటిషన్.. దేనికోసమంటే..!
- బెంగాల్ హింసపై సుప్రీంకోర్టులో పిటిషన్
- నివారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, మాల్డా, హుగ్లీతో సహా ఇతర జిల్లాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇక 200 మంది నిరసనకారులు అరెస్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Alluri Sitharamaraju District: అరకులోయలో మరో చేతబడి హత్య కలకలం..!
Also Read
అయితే తాజాగా బెంగాల్ హింసపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హింసను నివారించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ దర్యాప్తును సుప్రీం ధర్మాసనమే పర్యవేక్షించాలని న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. ప్రాణాలను కాపాడటానికి, హింసను నిరోధించడానికి సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత కొద్దిరోజులుగా బెంగాల్ నిరసనలతో అట్టుడుకుతోంది. ఎక్కువగా ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైల్వే ఆస్తులు ధ్వంసం, పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడం ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు.. లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు సద్దుమణగ లేదు. ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తెలిపారు. అయినా కూడా అల్లర్లు ఆగలేదు. పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకుని హింస చెలరేగింది.
ఇది కూడా చదవండి: East Godavari: బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్ కేసుల సర్వే.. కారణం ఇదే!
తాజావార్తలు
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!