Site icon NTV Telugu

BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు నియామకం.. తమిళనాడుకు ఎవరంటే..!

Bjptamilnadu

Bjptamilnadu

వచ్చే ఏడాది ప్రారంభంలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగానే కమలనాథులు కసరత్తు ప్రారంభించారు. బీహార్‌లో ఘన విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న నాయకులు… త్వరలో జరగనున్న ఎన్నికల రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ నియమించింది.

ఇది కూడా చదవండి: Sydney Terror Attack: నా కొడుకులాంటివాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పీయూష్ గోయల్ నియమితులయ్యారు. పీయూష్ గోయల్‌కు సహ-ఇన్‌ఛార్జ్‌లుగా అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధర్ మోహోల్ ఉండనున్నారు. ఇక అస్సాంలో జరగబోయే ఎన్నికలకు బైజయంత్ పాండా బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. సహ-ఇన్‌ఛార్జ్‌లుగా సునీల్ కుమార్ శర్మ, దర్శనా బెన్ జర్దోష్ ఉండనున్నారు.

ఇది కూడా చదవండి: Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా మరోసారి విజయం కోసం పోరాడుతుంది. ఇక కొత్తగా పార్టీ స్థాపించిన నటుడు విజయ్ కూడా టీవీకే విజయం కోసం పోరాడుతున్నారు. ఈసారి తమిళనాడులో ఎవరిని అధికారం వరించనుందో చూడాలి.

 

 

Exit mobile version