Site icon NTV Telugu

Piyush Goyal: కేసీఆర్ తెలంగాణకు “నిజాం”గా మారాడు.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదు

Piyush Goyal

Piyush Goyal

Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి.

ఇప్పటికే నీతి ఆయోగ్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తోందని తెలిపింది. ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కు అభ్యర్థనలు పంపామని.. అయితే ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంది. కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కూడా వెళ్లడించింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్, ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందం ఉందని అన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధాని మోదీకి మొహం చూపించలేకే సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు.

Read Also: Honeymoon Record: పదేళ్లు.. 65 దేశాలు.. హనీమూన్‌లో రికార్డు సృష్టిస్తున్న జంట

తాజాగా కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశ బహిష్కరణపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హజరకాకపోవడానికి కేసీఆర్ నిరాకరించడంపై తనకు తాను చాలా గొప్పగా భావిస్తున్నాడంటూ చురకలు అంటించారు. దేశాన్ని ముందుకెళ్లే దిశలో నీతి ఆయోగ్ పని చేస్తోందనే సంగతి సీఎం కేసీఆర్ మరిచిపోయారని..తెలంగాణఖు కేసీఆర్ నిజాం అయ్యాడని.. దేశం, రాష్ట్రాల అభివృద్ధిపై జరిగే చర్చను కేసీఆర్ నమ్మడని విమర్శించారు.

Exit mobile version