Site icon NTV Telugu

Piyush Goyal : ఏపీ, తెలంగాణలో అవకతవకలు జరిగాయి

ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. అవకతవకలు, ఆలస్యంగా రైతులకు చెల్లింపులపై కేంద్రం విచారణ చేపట్టాలన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ వరి ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ధృవీకరించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాలని కోరినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని, వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. అలాగే, ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదని, తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడ విచారణ జరపాలని ఎంపీ జీవీఎల్ కోరారు. రైతుకు ధాన్యం సేకరించిన వెంటనే డబ్బు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్మును ముందుగానే ప్రధాన మోడీ అదేశాల మేరకు చెల్లిస్తునామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.

Exit mobile version